![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి ఢీ డాన్సర్స్ వచ్చారు. అన్వేష్ , రాము రాథోడ్, ప్రేమ్ రంజిత్, శ్రేయ, మైథిలి, జానులూరి వచ్చారు. ఢీ డాన్స్ లో ఉన్నప్పుడు శేఖర్ మాష్టర్ కానీ మిగతావాళ్లంతా కూడా జానునీ బాగా హైప్ చేశారు ఇక ఇప్పుడు సుమ అడ్డాలో కూడా సుమ బాగా హైప్ చేసేసింది జానునీ. "జానూ నువ్వు చేసిన పెర్ఫార్మన్సెస్ లో మొత్తం ఎన్ని మిలియన్స్ వచ్చాయి అని అడిగింది. 200 , 250 మిలియన్స్ వెళ్లాయి అనేసరికి నా అన్ని షోస్ కూడా కలిపితే అన్ని వ్యూస్ కూడా వెళ్లి ఉండవు కదా అంటూ తన మీద తానె సెటైర్ వేసుకుంది సుమ. ఇక ఇందులో సుమ గ్రామీణ బ్యాంక్ పేరుతో ఒక స్కిట్ వేసింది.
అందులో బ్యాంకు లోన్లు ఇచ్చే మేనేజర్ గా నటించింది. ఐతే ఇందులో డాన్సర్ శ్రేయా రాణి లోన్ కోసం వచ్చింది. దానికి సుమ "అసలు లోన్ ఎందుకు కావాలి" అని అడిగేసరికి "అందరూ రీల్స్ చేస్తున్నారు. అలా ఫేమస్ అవుతున్నారు. నేను కూడా రీల్స్ చేయాలి. దానికి మంచి ఫోన్ కొనాలి. అందుకే లోన్ తీసుకోవాలి అనుకుంటున్నా" అంటూ చెప్పింది. దానికి సుమ షాకయ్యింది. ఇక ఈ షోలో తెలుగు లిరిక్స్ కి ఇంగ్లీష్ లో పాడించి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఫైనల్ లో మీరు ఎప్పుడెప్పుడు నవ్వుకుంటారు అని అడిగేసరికి ఎప్పుడు పిచ్చి లేస్తే అప్పుడే అంటూ పడీ పడీ పడీ నవ్వింది జాను. ఆ నవ్వుకు మిగతావాళ్ళు కూడా జతకట్టారు.
![]() |
![]() |